(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పరుండబోవునప్పుడు చేయవలసిన ప్రార్ధన
-
ఆరుదినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించిన సృష్టికర్తవైన నా దేవా! నీకు స్తోత్రములు. మాకుకూడ ఈ లోకములో విశ్రాంతి
ఏర్పరచినావు పగలు అంతయు పనిమీదనున్న మాకు విశ్రాంతి కలుగునట్లు రాత్రి సమయము ఇచ్చినావు. ఇప్పుడు
పరుండబోవుచున్నాము.
సుఖనిద్ర కలిగించుము. ఆమేన్.
-
లోకములో మా జీవితకాలమంతా పనిచేసిన తరువాత పరలోకమందు మాకు నిత్య విశ్రాంతి నియమించినావు. అది తలంచుకొని అది కడవరి
తలంపుగా
తలంచుకొని పరుండబోవుచున్నాము. ఆలకించుము ఆమేన్. దీవించుము. ఆమేన్.
-
నా ప్రియుడవైన తండ్రీ! నా శరీరము, నా ఆత్మ, నాకు కలిగిన సమస్తము నీకు అప్పగించి నేను నిద్రపోవుటకు
వెళ్ళిపోవుచున్నాను,
అంతయు
నీవే చూచుకొనుము ఆమేన్.
-
సర్వజన జనకుడా! నేను, మా వారు నిద్రమీద నున్నప్పుడు నీ పరిశుద్ధ దూతలను మా చుట్టు కావలిగాయుంచుము. ఆమేన్.
-
ఓ తండ్రీ! నా తండ్రీ! నన్ను ప్రేమించే తండ్రీ! నేను మీకు ముద్దాయిగా ఉంటాను గనుక ఉదయమున నేను లేవకముందు నీవు వచ్చి
నన్ను
పరలోకమునకు తీసుకొని వెళ్ళిన అది నీ ప్రేమయే గనుక వందనములు ఆమేన్.
-
కాపాడే తండ్రీ! విమోచకుడవైన తండ్రీ! చీమలు, దోమలు, ఈగలు, జెర్రిలు, తేళ్ళు, పాములు, జంతువులు, దొంగలు, మాకు హాని
కలిగించే
దయ్యములు, మాయొద్దకు రాకుండ కాపాడుము. ఆమేన్.
-
మేము మా కన్నులు మూసికొనియుండగా నీ కన్నులు తెరచి మమ్మును చూస్తూయుండే తండ్రీ! నీకు స్తోత్రములు. ఆమేన్. మంచి
ఆలోచనలు,
మంచి కలలు, నీ చిత్తమైతే మంచి దర్శనములు మాకు సంభవించేటట్లు కృప దయచేయుము. ఉదయమున శ్రమతీరి సుఖముగా లేచునట్లు కృప
దయచేయుము.
ఆమేన్.