(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పిల్లలకు నేర్పవలసిన ప్రార్ధన
-
1. యేసుప్రభువా! నీవు ఎల్లప్పుడు నాకు జ్ఞాపకము రావలెనని కోరుకొనుచున్నాను.
-
2 యేసుప్రభువా! నేను ఏ తప్పు చేయకుండా భక్తిగా
నడిచేందుకు బలము దయచేయుము.
-
3. యేసుప్రభువా! ఈ నిమిషము వరకు ఇన్ని సంవత్సరములు నన్ను కాపాడినందుకు వందనములు.
-
యేసుప్రభువా! నాకు చదువు చెప్పించుచున్నావు గనుక వందనములు.
- యేసుప్రభువా! నాకు కీర్తనలు నేర్పుచున్నావు గనుక వందనములు.
-
యేసుప్రభువా! నాకు ప్రార్ధనలు నేర్పుచున్నావు గనుక వందనములు.
-
యేసుప్రభువా! ఇప్పటివరకు ఆరోగ్యమును, చదువును, బలమును ఇచ్చి బాగుగా ఆహారము భుజించునట్లు కాపాడినావు గనుక వందనములు.
-
యేనుప్రభువా! నీవే నా దేవుడవు, రక్షకుడవు, తండ్రివి నన్ను కాపాడువాడవు. నా సమస్తము అయివున్నావు గనుక వందనములు.
-
యేసుప్రభువా! నాకు కావలసినవి ఇస్తావు గనుక వందనములు.
-
యేసుప్రభువా! చివరకు నన్ను మోక్షములోనికి చేర్చుకొందువు గనుక వందనములు.
-
యేసుప్రభువా! రాత్రులు, పగలు నాకు తోడైయుండుము.
-
యేసుప్రభువా! చదువులో, భోజన సమయములో, ఆడుకొనునప్పుడు మాకు
తోడైయుండుము.
-
యేసుప్రభువా! నాకు ఏ కష్టము రాకుండా కాపాడుము.
-
యేసుప్రభువా! నాకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము అనుగ్రహించుము.
-
యేసుప్రభువా! నన్నే గాదు, తల్లిదండ్రులను, అక్కలను, అన్నలను, తమ్ములను, చెల్లెండ్రను దీవించుము.
-
యేసుప్రభువా! మా చుట్టాలు ఎక్కడ ఉన్నారో వారినందరిని దీవించుము.
-
యేసుప్రభువా! మాకు సహాయము చేయువారందరిని దీవించుము.
-
యేసుప్రభువా! మా చుట్టానున్న వారిని మా యింటిలో ఉన్న వారిని దీవించుము.
-
యేసుప్రభువా! జంతువులను, పక్షులను కూడా దీవించుము.
-
యేసుప్రభువా! చిన్నపిల్లలను, అన్యులను, క్రైస్తవులను, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చు వారిని దీవించుము.
-
యేసుప్రభువా! ఇక్కడ ప్రార్ధనకు వచ్చు వారిని దీవించుము.
-
యేసుప్రభువా! మా దేశమంతటిని దీవించుము.
-
యేసుప్రభువా! మీ మతమే మా దేశమంతా వ్యాపింపజేయుము.
-
యేనుప్రభువా! నేను ఈ ప్రార్థన జ్ఞాపకము ఉంచుకొని ప్రార్ధించుకొనునట్లు దీవించుము.
-
యేసుప్రభువా! నిన్ను నీ మతమును అందరు తెలిసికొనునట్లు దీవించుము.
-
యేసుప్రభువా! నేను మంచి అబ్బాయిని/
అమ్మాయిని
అగునట్లు దీవించుము.
-
యేసుప్రభువా! ఈ ప్రార్థన తరచుగా చేసికొనునట్లు దీవించుము ఆమేన్.