(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సర్వాంశ ప్రార్ధన
-
1. ఓ దేవా! నా తండ్రీ! నేను ప్రార్ధన చేసుకొనేటందుకు ఈ సమయము దయచేసినందుకు అనేక వందనములు.
-
2. నీవే నన్ను కలుగజేసిన తండ్రివైయున్నావు. నీవే మాకు అన్న వస్త్రాదులిచ్చి పోషించే కర్తవైయున్నావు. నీవే మా పాపములు
పరిహారము
చేసే రక్షకుడవైయున్నావు. నీవే నన్ను పాపములో పడకుండ కాపాడే కర్తవైయున్నావు. నీవే నాకు నీ వాక్యము నేర్పించే,
బోధించే
బోధకుడవై యున్నావు. నీవే నన్ను చిక్కులలో నుండి తప్పించే ఆదరణకర్తవైయున్నావు. నీవే నా జబ్బులు బాగుచేసి
ఆరోగ్యమిచ్చే
వైద్యుడవైయున్నావు. నీవే నాకు అన్నిటిలో ఆధారమైయున్నావు. నీవే నాకు మోక్షమిచ్చే శక్తిమంతుడవైయున్నావు. కాబట్టి
నీకనేక
నమస్కారములు చెల్లించుచున్నాము.
-
3. ఓ దయగల తండ్రీ! నన్నును, నా స్వజనులను దీవించుమని వేడుకొనుచున్నాము.
-
4. నా పాపములు క్షమించుము. నా తలంపులలో పాపములు లేకుండా చేయుము. నా చూపులో పాపము లేకుండా చేయుము. నా వినడములో పాపము
లేకుండజేయుము. నా మాటలలో పాపములు లేకుండ చేయుము. నా క్రియలలో పాపములు లేకుండా చేయుము.
-
5. పాపములను విసర్జించే శక్తి నాకు దయచేయుము.
-
6. నిన్ను గురించిన సంగతులు ఎవరిచేతనైనను, నాకు తరచుగా చెప్పించుచుండుము. అలాగే పుస్తకములలో నిన్ను గురించిన
సంగతులు
చదువుకొనే జ్ఞాన హృదయము దయచేయుము.
-
7. నేను బ్రతికినంతకాలము నీ భక్తిమీద ఉండగల మనస్సు దయచేయుము.
-
8. ఈ లోకములో నేను బ్రతుకవలసిన బ్రతుకు అయిపోయిన పిమ్మట నన్ను నీ యొద్దకు క్షేమముగా చేర్చుకొనుము. ఓ యేసుక్రీస్తు
ప్రభువా!
నీవే
నాకు సర్వములో సర్వమైయున్నావు. గనుక నీకనేక స్తోత్రములు.
-
9. ఓ దేవా! పాపము నీవు కలుగచేయలేదు. దయ్యాలను నీవు పంపలేదు. జబ్బులు నీవు పంపలేదు. ఇబ్బందులు, కరువులు నీవు పంపలేదు,
భూకంపము,
పిడుగు ఇవి మనుష్యులకు కలుగడము నీకిష్టములేదు. సాతాను చేసిన పాపము వలననే ఇవన్నీ కలుగుచున్నవి. నీవు నాకు కీడుచేసే
దేవుడవు
కావు. నీకనేక వందనములు.
ఓ యేసుప్రభువా! నేనెల్లప్పుడు నిన్నుబట్టి నిలువబడే కృప దయచేయుమని మిక్కిలి వినయముతో
వేడుకొనుచున్నాను. ఆమేన్.