(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

రక్తస్తుతి



ప్రభుయేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము, ప్రభుయేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము.


యేసునామ సంకీర్తనం, ప్రభుయేసు నామ సంకీర్తనం, రక్షక నామ సంకీర్తనం, జగద్రక్షక నామ సంకీర్తనం, ఇమ్మానుయేలు నామ సంకీర్తనం, త్రియేక దేవ నామ సంకీర్తనం, యేసుక్రీస్తు నామ సంకీర్తనం.


యేసుప్రభువా! నిన్నే కోరుకొనుచున్నాము. నిన్నే అభినందించు చున్నాము. నిన్నే ఆరాధించుచున్నాము. నిన్నే మహిమ పరచుచున్నాము. ఆమేన్.


యేసుప్రభువా! సైతానును, అంత్యక్రీస్తును, అబద్ధప్రవక్తలను, దురాత్మలను, దయ్యములను మార్పునొందని వారిని, మృతులైనవారిని నీవు జయించినావు. ఆ జయమే నా జయము. నీ రక్తమే నా పానము. నీ పాదమే నా శరణము, నీ సన్నిధే నాకాశ్రయము. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడెను. మరణముయొక్కయు, మృతులలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందున్నవని చెప్పిన ఓ యేసుప్రభువా! నా తండ్రీ! నీ ముఖశ్వాసముచేత వానిని సంహరించుము. నీ ఆగమన మహిమచేత వానిని నాశనము చేయుము. ఆమేన్.