(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సైతానును బంధించు ప్రార్థన
త్రియేక దేవుడవైన తండ్రీ! అన్నిటి తండ్రీ! అందరి తండ్రీ! ఆకాశమందున్న తండ్రీ! నీ నామమున ప్రార్థించుచున్నాము. మేము
నీ
నామమునుబట్టి ప్రార్ధించుచున్నాము. వేరొక నామమునుబట్టి ప్రార్థిస్తే మా ప్రార్థనలు నెరవేరవు. కాబట్టి నీ
నామమునుబట్టి
ప్రార్థించుచున్నాము. “నా నామమునుబట్టి మీరు ఏది అడిగినను చేస్తానన్నావు” వేడుకొనకముందు దయచేస్తానన్నావు. కాబట్టి నా
మనస్సులో ఏమి ప్రార్ధనలు యున్నవో నీకు ముందుగానే తెలుసును. మరియు మేము మనవి చేయుచుండగా నీవు నెరవేరుస్తావు అని
అన్నావు.
కాబట్టి ఈ రెండు వాగ్ధానములు ప్రవచన పంక్తులనుబట్టి తగిన ప్రార్ధనలు చేయుచున్నాము. దేవునియొక్క సింహాసనము, జ్ఞాపకము
తెచ్చుకొని సాష్టాంగపడి ప్రార్ధించుచున్నాము. ప్రార్థనలు ఆలకించుము. నీకు అనేక నమస్కారములు.
ప్రభువా! నరవంశమును బట్టి
మేము
పాపులము. స్వజనము, మా పూర్వీకులనుబట్టి మా తల్లిదండ్రులను బట్టి మేము పాపులము పుట్టుటనుబట్టి పాపులము. నీ పేరు
ఎత్తుటకైనను
తగనివారము. అయినను నీవు మమ్ములను నీ సన్నిధికి రానిస్తూయున్నావు. నీకు వందనములు. మేము అయోగ్యులము గనుక నీ కృపను
పొందుటకు
తగనివారము. నీవు అంతగొప్ప దేవుడవు.
ఇంత గొప్ప పాపులమైన మాపై ఇంత గొప్ప కృప చూపించుచున్నావు. వేడుకొనకముందే మీ ప్రార్థనలు ఆలకించినానని మేము మనవి చేస్తుయుండగానే వినినావు. నీ యెదుట మా అయోగ్యతను ఒప్పుకొనుచున్నాము. తండ్రీ! మమ్మును శోధించుచున్నట్టి, ఈ పాపములో పడవేయుచున్నట్టి సైతానును బంధించివేయుము. మేము ప్రతి ఇబ్బందివద్ద నలుగుచున్నాము. భూతములను బంధించియున్నట్టి నీవు ఇప్పుడు మా ఎదుట సైతానును బంధించుము. మరియు భూమిమీద మేము అతనిని బంధించు చున్నాము. వాగ్ధానము చేసియున్నావు గనుక మత్తయి 18:18 బట్టి వేడుకొనుచున్నాము. మా ప్రభువా! అతనిని ఇదివరకే బంధించియుంటే, ఇప్పుడు మా జోలికి రాకపోవును. ఎలాగు చెలరేగుచున్నాడో చూచుచున్నావు కదా! అతనికి నీవిచ్చిన స్వాతంత్ర్యమును, నీవు మాకిచ్చిన సెలవు, స్వాతంత్రముతో బంధించుచున్నాము. పరలోకములోకూడ బంధించుము. అప్పుడు అతడు మా జోలికిరాడు. మా మిషను పనిద్వారా వాడి నివారణ చేసుకొనగలము. మమ్ములను నీ సన్నిధికి రానిచుచున్నావు.
ప్రభువా! అపవాది యొక్క క్రియలను నాశనముచేయుటకే దేవుని కుమారుని ప్రత్యక్షపరచినందుకు నీకు వందనములు. పిశాచిని బంధింపవలెను అని ఇప్పుడే మనవి చేసియున్నాము. అతని క్రియలు, ఆలోచనలు, పన్నాగములను, ప్రయత్నములను, విషసంబంధమైన నడతలను బంధించుము. వాడి దండును నాశనము చేయుము.
తండ్రీ! అపవాదిని ఎదిరించుడి అప్పుడు అతడు పారిపోవును అని వ్రాయించినావు గనుక మాకు సైతాను ఎదిరించే సింహపు గుండె దయచేయుమని వ్రాసికొన్నాము. ఆ మనవి నీవు అంగీకరించుము. మేము ఈ ప్రార్ధనలు చేసినప్పటికిని, అతడు మొండితనముగా మాయొద్దకు వచ్చును.
గనుక వాడిని నిత్యము ఎదిరించు సింహపుబలము దయచేయుము. అతడు వచ్చునప్పుడెల్లా మా గద్దింపు విని పారిపోవునట్లు నీ వాగ్ధాన బలము, ధైర్యము మాకు దయచేయుము. ఆమేన్.