(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ఆనంద ప్రార్థన
ఓ దేవా! దయగల తండ్రీ! నీవు నీ కుమారునిద్వారా అపరిమితమైన ప్రేమచే మాకు రక్షణ సంతోషముకూడ అనుగ్రహించినావు, స్తోత్రము. మరియు నీ సహవాస సంతోషముకూడ దయచేసినావు గనుక స్తోత్రము. నీతో ఈ రెండు సంతోషములు నాకు కలుగుటకు నీ మంచి స్వభావమే కారణమైయున్నది. అది ఇంకొక సంతోషము. కాబట్టి ఈ మూడు సంతోషముల నిమిత్తము నీకు వందనములు.
ఈ సంతోషములతో నా హృదయపు గిన్నెయును, నా బ్రతుకు గిన్నెయును నిండి ప్రవహించునట్లు నీ కృప దయచేయుము. పవిత్రమైన స్వభావముగల ఓ తండ్రీ! ఈ మూడు పవిత్రములైన సంతోషములు మాకు ఈ లోక జీవనములోని అన్ని స్థితులలోను యుండేటట్లు చేయుము. మరియు ఓ తండ్రీ! నీయొక్క రూపము, మాలో ఏర్పడే వరకు మేము ఈ సంతోషములను నిలుపుకొనుటకు పాటుపడే శక్తి అనుగ్రహించి, ఇందుమూలముగా శక్తిని, మహిమను, ఘనతను అనుగ్రహమును పొందుదుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.