(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

ఇంజక్షన్ ప్రార్థన



ఓ దయగల ప్రభువా! సంఘము పూర్వకాలముకంటె ఈ కడవరి కాలములో బైబిలు గ్రంథము విప్పి ఎక్కడ చదువుకొన్నను సరే, యే వచనము చదువుకొన్నను సరే ఆ వచనములో నుండి సంఘము యొక్క శరీరములోనికి శక్తి ఇంజక్షన్ వలె వెళ్ళేటట్లు చేయుము. ఆమేన్.


ఓ ప్రభువా! బైబిలులో మాత్రమే కాక నీ భక్తులైన వారు ఆత్మ ప్రేరేపణతో చేసే ఉపన్యాసములు కూడా మాకు, సంఘమునకు మంచి ఇంజక్షనులు అయ్యేటట్లు మార్చుము. యేసుప్రభువా! అవి మాత్రమే కాక సంఘమునకు కలిగే హింసలు కూడ మంచి ఇంజక్షనులుగా అయ్యేటట్లు మార్చుము.


యేసుప్రభువా! ఈ వేళ కూడ మాకు కొత్త వర్తమానము దయచేయుము. అది కూడ ఒక ఇంజక్షను అవును గాక! నీకు మహిమ సంఘమునకు జయము. అపవాది క్రియలకు లయము. నీ రక్తము సంఘమునకు పట్టించుము. (సంస్కారము ద్వారా) నీ రక్తమే సంఘమునకు ఇంజక్షను చేయుము. ఆమేన్.


గమనిక: (అదివరకు చదివేది వేరు. ఈ కడవరి కాలములో ఒక్కసారి చదివేది వేరు. ఇప్పుడు అయ్యగారు చెప్పిన తరువాత చదివేది వేరు. కాగితాలు తిరగవేసి ఎక్కడ చదివినను సరే, ఆకాను, యూదా, అననీయ సప్పీరాల కథ. కయీను కథ చదివినను సరే. సొదొమ వారి కథలు కంటబడితే ఇవి దుశ్శకునములా ఉన్నవని అనుకొనకుండ చదువుము. దేవుని వాక్యములో దుశ్శకునములు లేవు. అకస్మాత్తుగా చంపే ఇంజక్షన్లు లేవు. అన్ని బలహీనతలను తోలి, బలపరచే ఇంజక్షనులే ఉన్నవని సంతోషించండి.)