(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

రోగులు చేసికొనవలసిన ప్రార్ధన



ఓ యేసుక్రీస్తు ప్రభువా! నీవు వైద్యుడవైయున్నావు గనుక వందనములు. నీయొద్దకు పూర్వకాలము ఎంతమంది రోగులు వచ్చినారో అందరిని బాగుచేసినావు. గనుక నన్నును బాగుచేయుము. ఎటువంటి వ్యాధియైన బాగుచేసినావు గనుక నా వ్యాధి బాగు చేస్తావు. ఓ తండ్రీ నేను నిన్ను నమ్ముకొనియున్నాను. తగిన ఔషదము దొరికేటట్టు చేసికూడ నీవు బాగుచేయగలవు. ఔషదము లేకుండాకూడ బాగుచేయగలవు. నీ వాక్యమే గొప్ప ఔషదము. నీ వాక్యము నాకు ఇంకను బాగుగా నేర్పించుము.


ఓ యేసుక్రీస్తు ప్రభువా! నీవు దయ్యాలను వెళ్ళగొట్టితివి. ఇప్పుడుకూడ వెళ్ళగొట్టగలవు. పాపాత్ముల పాపములు క్షమించితివి. చనిపోయిన వారిని బ్రతికించితివి. నేను నిన్ను నమ్ముకొన్నాను గనుక నీవు ఎంత ఉపకారమైన చేయగలవు. నాకు ఆ నమ్మిక కలిగించుము. నా మనస్సులోకి అపనమ్మిక రానియ్యకుము. అవిశ్వాసము రానియ్యకుము. సందేహము రానియ్యకుము. నా మనస్సులో ధైర్యము కలుగజేయుము. విసుగుదల కలుగును గనుక దానిని రానియ్యకుము. ఓ తండ్రీ! నీకనేక నమస్కారములు.


నా మనస్సులో ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగించుము. జబ్బులు బాగుచేయుము. నేను ఎల్లప్పుడు నీ సేవలోయుంటాను. నాకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేయుము. ఈ కాలములోకూడ అనేకమంది రోగులు మందులు వాడుకొనకుండ బాగు అగుచున్నారని అనుకొనుచున్నాను. నా ప్రార్ధనలు నీ కృపనుబట్టి ఆలకించుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.


ప్రార్ధన చేయట సూచనలు: