(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
దయ్యములను వెళ్ళగొట్టు ప్రార్ధనాంశములు
-
1. ఓ ప్రభువా! మార్కు 16:17లో మీరు దయ్యములను వెళ్ళగొట్టుడని తెలియపర్చినావు. వెళ్ళగొట్టుదురని ప్రవచించినావు.
గనుక
మేము
అడుగు చున్నాము. మా మీదికి వచ్చిన దయ్యములను వెళ్ళగొట్టుము.
-
2. “అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును” అని యాకోబు 4:7లో వ్రాయించినావు. గనుక ఎదిరించు
శక్తిని
అనుగ్రహించుము.
-
3. సాతానును శీఘ్రముగా మీ పాదములక్రింద త్రొక్కించెదనని కూడ రోమా 16:20లో వ్రాయించినావు. గనుక అది ఇపుడు
నెరవేర్చుము.
సన్నిధి కూటస్తులు నీ సెలవు అడిగి వెళ్ళగొట్టేటట్లు ఏర్పరచుము. ఆమేన్.