ఆదివార ప్రమేయము - 3



భూలోక సంఘము పరలోక సంఘమునకు ముంగుర్తుగా నుండవలెను. యూదుల యొక్క మతము, భూమిమీద రాబోయే క్రైస్తవ సంఘమునకు ముంగుర్తుగా నుండెను గదా! అట్లే భూమిమీద క్రైస్తవ సంఘముకూడ ముంగుర్తుగా నుండవలెను. గనుక ఈ ముంగుర్తు లన్నియు సరిగా నుండవలెను. అనగా

2కొరింథి 7:1 "ప్రియురాలా! మనకు ఈ వాగ్ధానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము". అది మాత్రమే కాకుండ పెండ్లికుమార్తె యొక్క భూలోక గృహములో అనగా కుటుంబములో, అనగా గుడిలోను, అల్లరి, కేకలు, పోట్లాటలు, కలహాలు, వాక్కుకలహాలు, మనస్పర్ధలు, భిన్నాభిప్రాయములు; ఇవి ఉండక సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి, ఉండవలెను. యెరూషలేము అను పేరునకు శాంతి పురమని అర్ధము. నూతన యెరూషలేము అను శాంతివురము చేరగోరువారియొక్టు గృహము శాంతి గృహమై యుండవలెను. ఇది ముంగుర్హు శాంతి. అందుచేత భూలోకములో ఈ గృహము శాంతి ఆరాధన చేయగలదు. ఇంటిలో శాంతి లేకపోయిన ఆరాధనలో నెమ్మదిగా కూర్చుండు బుద్ధి కలుగునా? కలుగదు, గనుక శాంతి సంపాదించుకొనవలెను.