దీవెనల జాబితా
- పాప ప్రేరేపణ గలవారలారా! దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మును దీవించును గాక!
-
అనారోగ్యవంతులారా! దేవుడు మీకు ఆరోగ్యమిచ్చి మిమ్మును దీవించును గాక!
-
లేమిగల వారలారా! దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మును దీవించును గాక!
-
బిడ్డలులేని వారలారా! దేవుడు మీకు శిశుదానము చేసి మిమ్మును దీవించును గాక!
-
భూత పీడితులారా! దేవుడు మీకు విముక్తిని దయచేసి మిమ్మును దీవించును గాక!
-
మందమతులారా! దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమిచ్చి మిమ్మును దీవించును గాక!
-
శత్రుబాధగల వారలారా! దేవుడు మీకు శత్రు బాధలేకుండా జేసి మిమ్మును దీవించును గాక!
-
అన్యాయము పాలగుచున్న వారలారా! దేవుడు మీకు న్యాయమనుగ్రహించి మిమ్మును దీవించును గాక!
-
బుణబాధగల వారలారా! దేవుడు మీకు బుణబాధ తీర్చి మిమ్మును దీవించును గాక!
-
యుక్త సమయమున పెండ్లి సమకూడని వారలారా! దేవుడు మీకు మంచి జత నేర్చరచి మిమ్మును దీవించును గాక!
-
కుటుంబ కలహములుగల వారలారా! దేవుడు మీ కలహములను ఆపుజేసి, ఐకమత్యత కలిగించి మిమ్మును దీవించును గాక!
-
నానా విధములైన చిక్కులు గలవారలారా! దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మును దీవించును గాక!
-
దైవభక్తి కుదరని వారలారా! దేవుడు మీకు మనో నిదానమును, స్థిరభక్తావేశమును పుట్టించి మిమ్మును దీవించును గాక!
-
చదువరులారా! దేవుని యెడల అపనమ్మిక, భీతి, విసుగుదల, తొందరపడు గుణము, అనాలోచన, చింత, నిరాశ, మొదలగునవి మాలోనికి చేరకుండునట్లు దేవుడు మిమ్మును దీవించును గాక!
-
జీవాంతమందు మీకు మోక్షభాగ్యము లభించునట్లు దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమేన్.