భవిష్యత్తు



భూ గోళ వాస్తవ్యులైన సహకారులారా! నేడు అనగా (ఈ సంవత్సరం) ఆపత్కాల సమయము గనుక ఇది తప్పించుకొనగల శక్తి మాకు కలుగునుగాక! మా బైబిలు మిషనులోని కొందరికి వచ్చిన దర్శనముల సందేశము వినండి. క్రీస్తు ప్రభువు ఇట్లు చెప్పుచున్నారు. "మిగుల త్వరలోనే లోకమంతటను భయంకరమైన భూకంపము/ప్రళయము కలుగును, అనేకులు నశింతురు. గాని దైవప్రార్ధనలోను, ధ్యానములోను ఉండువారు ఆ భూకంపమును/ప్రళయమును తప్పించుకొనగలరు." ప్రియులారా! భూకంపమైనను, మరియే ఆపదయైనను పాపము వలననే కలుగును. పాపము మాని పవిత్రులుగా జీవించువారు నిర్భయముగా నుందురు. ఇతర మతస్తులకు కూడ 2003వ సం॥ము భూకంప సం॥రమని, వారికి తోచినది చెప్పుకొనుచున్నారు. అన్ని మతముల వారు సృష్టికర్తను మాత్రమే పట్టుదలతో ప్రతిదినము ప్రార్ధింపవలెను. ఇతర పూజలను మానవలెను. తప్పించుకొనగల ఉపాయము కొరకు ప్రార్ధించండి. ఎంతమంది ఎన్ని మారులు ప్రార్ధించినను, భూకంపము/ప్రళయము రాకమానదు గాని ప్రార్ధనా పరులకు ఇది తప్పిపోవును. ఎంత చెప్పినను నమ్మనివారును, ప్రార్థింవనివారును ఉందురు గనుక భూకంవమును/ప్రళయము తవ్పదు. ఇట్టి భూకంపమును/ప్రళయము మనుష్యులు ఎరుగరు.


ప్రియులారా! మీరందరు ప్రార్ధనలో ఉండి తప్పించు కొనవలెననియే ఈ పత్రిక వ్రాయుచున్నాము. యేసు ప్రభువు ఈ అంశముమీద మాకు చాల సంగతులు తెలియపరచుచున్నారు. వీలైన యెడల ఎవరైన ఈ సందేశములను అచ్చువేయించిన మాకు ఎంతో సంతోషము. ఈ విషయములు అన్ని భాషలలో పడవలసినదే. ఎవరు ఈ ప్రయత్నము చేయగలరో చూడవలెను. ప్రియులారా! "భూకంపము/ప్రళయము జరుగదు. అయినను ఇదంతయు మాకెందుకు?" అని మీరందురేమో! తీరా జరిగినప్పుడు, మీరు చూచి మాకేల చెప్పలేదు? అని మమ్మును అడుగుదురు. జరుగని యెడల నయమేగాని, అప్పుడు మామాట అబద్ధమైనదని మమ్మును హేళన చేయుదురు. కాబట్టి నిశ్చయముగా జరుగునని మనస్సులో అనుకొని, ప్రార్ధన చేసినయెడల నష్టమేమున్నదని తెగించి ప్రార్ధించండి. ఇప్పుడే ప్రార్థింపనియెడల ఆపథ్దినమందు ప్రార్ధన కుదరనే కుదరదు. గాని మాలో తప్పులు పట్టవద్దు. అందువలన మీకు ప్రయోజనమవేమియు కలుగదు. సృష్టి దేవుని పక్షము. నరుడు దేవుని ఎదిరించుచున్నందున, వారిని భూమి మింగనైయున్నది. ఈ మధ్య కొన్ని స్థలములలో భూమి వణకినది. ఇది పెద్ద భూకంపమునకు సూచన. మీ స్నేహితులకు ఈలాగున టెలిగ్రాం ఇయ్యగలరా! New Global Earth Quake! Pray Our Creator for Protection. దేవుడు మాకు అట్టి శ్రద్ధ కలిగించునుగాక! ఆమేన్.