దేవుని ప్రార్థించండి



దేశీయులారా! అపాయము వచ్చినప్పుడు తప్పించుకొనుటకు, మరెన్నో ప్రయత్నములు చేయుదురు. అవన్నియు నెరవేరుటకును, నూతన సాధనములు కల్పించుటకును, దైవ ప్రార్ధన ప్రయత్నము చేయగలరా? ఇది అన్ని యత్నముల కంటె మొదటిది, ముఖ్యమైనదియునై యున్నది. గాలి, వానలు, వరదలు, తిండి భేదములు, చలి, వేడి, సముద్ర ప్రయాణములు, బండ్ల ప్రయాణములు, జంతువులు, పురుగులు, పిడుగులు, భూకంపములు, వ్యాధులు, ఇబ్బందులు, కరవులు ఈ మొదలగు వానివలన హాని కలుగుచున్నది. ఇవి దేవుడు గాక మరియెవరు తప్పించగలరు! గనుక భూమ్యాకాశములను, సమస్తమును కలుగజేసిన ఆయననే ప్రార్థించండి. ఆయన కలుగజేసిన సృష్టిలోని దేనిని ప్రార్ధించినను ప్రయోజనము లేదు. ఏది మిగుల అపాయకరమైన కాలము? పైన ఉదహరించినవి ఉన్న కష్టకాలమా? లేక పాపకాలమా? మనము పట్టుదలతో ప్రార్థించిన యెడల ఈ రెండు విధములైన అపాయములు తొలగును. కష్టకాలమునకు కారణమైన పాపము ముందుగా పరిహారము కావలెను. పాపము మనలను దేవునికిని, మోక్షమునకును, దూరస్థులనుగా చేయును. ఈ దుస్థితి ప్రార్ధనవలననే అంతరించును. గనుక దేవుని ప్రార్ధించండి.


ప్రతి ఇంటిలోని వారందరు ప్రతిదినము దేవుని ఎదుట మోకరించి ప్రార్ధింపవలయును. దేవుడు పాపుల మొరవినునా? మన కష్టములు చూచి, ఆయన ఎందుకు ఊరుకున్నాడు? అను ఇట్టి ప్రశ్నలు కట్టివేసి ప్రార్ధించండి. ఇది మరెందరిచేత చదివింతురో! ఎందరికి వినిపింతురో!

మా క్రైస్తవుల మనవి ఇది: "అన్ని పూజలు మాని, యేసుక్రీస్తు ప్రభువును పూజచేసి చూడండి. మా ప్రార్ధనలు సిద్ధించును" దేవుడు మిమ్మును దీవించునుగాక!


క్రీస్తు ప్రభువును పూజించుట వలన కలుగుమేళ్ళు ఏవి?

ఈ మేళ్ళేనా? మరియే మేళ్ళును కలుగవా? కలుగకేమి

క్రీస్తు ప్రభువును ప్రార్థించిన తరువాత అవి నెరవేరునని నమ్మవలెను. క్రీస్తుప్రభువే మన ప్రార్ధనలన్నిటికి నెరవేర్చి యున్నాడు. "క్రైస్తవుల ప్రార్ధనలు ఎందుకు నెరవేరుటలేదు" అని అడుగుదురేమో! నమ్మికలోనో, నదడతలోనో లోభముండుటను బట్టి నెరవేరవు.


క్రీస్తు ప్రభావము వలన పాపులకు, రోగులకు, బీదలకు, బిడ్డలు లేనివారికి, భూత పీడితులకు, అప్పులపాలైన వారికి, కోర్టులో వాజ్యములు గలవారికి, కుటుంబ కలహములు గలవారికి, తప్పిపోయిన వస్తువులు గలవారికి, సకాలములో పెళ్ళి సమకూడనివారికి, ఉద్యోగము లేనివారికి, విషపురుగువల్ల బాధపడవారికి, పశువులకు మేలు కలుగుచున్నది. కొందరికి వెంటనే, మరికొందరికి ఇంటివద్ద స్వస్థత కలుగుచున్నది. తమ కోరికలు నెరవేర్చుకొనగోరువారు, పాప కార్యములు మరియు ఇతర పూజలు మానివేసి, క్రీస్తుని మాత్రమే పూజింపవలయును. బోధ వినిపించుట పాదురులు లేక బోధకులపని, ప్రార్ధనలు చేయుట వరము పొందిన వారిపని, నమ్ముట ప్రజలపని బాగుచేయుట క్రీస్తు ప్రభువు పని.


క్రీస్తును పూజించుటకు ఆయన ఎవరు? ఆకాశమును, భూమిని, సంపద సమస్తమును కలుగజేసిన దేవుడు, నరులకు కనబడి, వారితో కలసి మెలసి, వారి నిమిత్తమై నెరవేర్చవలసిన సమస్త కార్యములు నెరవేర్చుటకై, మానవుడై జన్మించిన రక్షకుడు. ఆయన మానవావతార కాలమున యేసుక్రీస్తు అను నామమును ధరించెను. ఆయన ఒకరి రక్షకుడే కాదు, నమ్మువారందరి రక్షకుడునై యున్నాడు.

మీకు శుభము కలుగును గాక!