స్వంత ఆత్మ
-
స్వంత ఆత్మ అనగా నైజబుద్ధి. ఇది దయ్యము కంటె ఎక్కువ హానికరమైనదని చెప్పవచ్చును. ఇది ఆదాము హవ్వల వలన మనకు వచ్చినదని కూడ చెప్పవచ్చును. ఇది మన స్వంతముగా తెచ్చుకొన్నదని కూడ చెప్పవచ్చును.
-
దీనివలన దైవాజ్ఞలు, మనుష్యాజ్ఞలు మీరటము ఉండును.
-
గురువులయొక్క సెలవులేనిదే ఎక్కడికిని వెళ్ళకూడదు.
-
ముఖము పిచ్చివాలకముగా ఉండునట్లు చేసికొనకూడదు.
-
శుభ్రముగా ఉండకపోవుట, శుభ్రమైన బట్టలు వేసికొనకపోవుట అనగా ఆరోగ్య పద్ధతులను మిరుట తప్పే.
- అదే పదముగా (అదేపనిగా) ఒక సంగతి ఆలోచించి, మనసు చెడగొట్టు కొనుట కూడ తప్పే.
-
మీటింగులలో ఉద్రేకపు మాటింగులు పెట్టుట, ప్రస్తుతము మాని వేయవలెను.
-
మత విషయములు అధికముగా ఆలోచించుచున్న యెడల పిచ్చితనము అబ్బును. అందుచే దిగంబరత్వము, బూతుమాటలు, కొట్లాటలు, దొంగిలించుటలు ఈ మొదలైనవి కలుగును.
-
అధికముగా ప్రార్ధన చేయుట, బైబిలు చదువుట, బోధలు చేయుట, ఈ మొదలైనవి కూడ మనస్సును బలహీన పరచును.
-
"అద్భుతములు చేయవలయును" అనేపట్టు మానవలయును.
-
స్వంత ఆత్మ ఎక్కువగా ఉన్నందువలన తప్పుడు దర్శనములు, తప్పుడు ఊహలు, తప్పుడు స్వప్నములు అన్నియు కలుగును.
- దీర్ఘ ప్రార్ధనలు మరియు తిక్కపట్టు ప్రార్ధనలు ఈ మొదలైనవి చేస్తే మన చిత్త ప్రకారముగా చేయవలసినదని, మనము దేవునిని బలవంత పెట్టినట్లుండును. ఇది గొప్ప తప్పు.
- స్వంత ఆత్మ ఉండుట వలన దురాత్మకూడ ప్రవేశించును.
- తుదకు దేవునిని దూషించుట, నేనే దేవుడననుట ఈ మొదలైనవి కలిగి యుండును.
- స్వంత ఆత్మ ఉండుట వలన దురాత్మకు చోటుండును గనుక లేనిపోని స్వరములు వినబడుచుండును. అవి కొన్ని మంచివిగాను, కొన్ని చెడ్డవిగాను ఉండును. సైతానెప్పుడును సంపూర్ణ సత్యము చెప్పదు. అసత్యము, సత్యమై యున్నదని మనము భ్రమించు నిమిత్తమై, అసత్యమును సత్యముతో కలివి చెవ్పును. ఇది గొప్పు మోసము.
-
స్వంత ఆత్మ ఉన్నయెడల దురాత్మ యుండును గనుక మెస్మరిజమ్ (వళీకరించు కొనుట) చేయుటకు ప్రయత్నించెదవు. ఇది కూడని పని.
-
స్వంత ఆత్మ ఉన్నందువలననే, నేను అందరికంటే గొప్పవాడననియు, నా కంటె సంగతులెవరూ గ్రహింపలేరనియు, ఇవి మహాగొప్ప మర్మములనియు నీవు చెప్పుదువు, గాని వాటిని బుజువు పరచలేవు.
-
తుదకు ఈ రెండు ఆత్మలు కలిసి, నిన్ను అగ్నిలోనో, నీటిలోనో ముంచి వేయును. నీ ఆరోగ్యము చెడగొట్టును, మనస్సు చెడగొట్టును, ఆత్మ జీవనమును చెడగొట్టును.
-
మరియు నాకు ఏమియు అక్కరలేదు, బట్టలతోను, సొమ్ముతోను, బ్రతుకవలసిన వాటితోను, వేటితోను పనిలేదని చెప్పుదువు. గనుక న్వంత ఆత్మకు లోబదవద్దు.
-
ఈ రెండును (స్వంత ఆత్మ, దురాత్మ) కలిసి నేనే దేవుడను, నేనే ప్రార్ధనయై యున్నాను, నేనే బైబిలు అయి ఉన్నాను, నేను ఏ బైబిలు చదువనక్కరలేదు, నా హృదయములోనే బైబిలు ఉన్నది అని చెప్పుదువు. తుదకు ఈ రెండును నిన్ను నరకమునకు కొంచుకొని పోవును. గనుక వీటికి చోటియ్యరాదు.
-
షరా:- మంచి విషయములే జరిగించేటప్పుడు, చెడ్డ విషయములు కూడ వచ్చి, చేరుచున్నవి గనుక ప్రస్తుతము అవి (ఆ మంచి కార్యములు) స్వయముగా చేయక, ఎరిగిన వారిచేత చేయించుకొనుట క్షేమమైయుండును. ఎవరెవరి యొద్ద తప్పుడు మాటలు పలికినావో, కాని చర్యలు జరిపినావో, వారియొద్ద తప్పు ఒప్పుకొనవలయును. ఒకదరి నుండి విశ్వాసులు మంచి సంగతులు నేర్పిస్తూ ఉంటే, మరొకదరి నుంచి చెడ్డ ఆత్మ, చెడ్డ సంగతులు నేర్పించు చుండును. ఒకసారి ఆత్మానుభవము పొందిన తరువాత, ఈ దుస్థితిలోనికి దిగిన యెడల, మారుట బహు కష్టమై యుండును. గనుక బహు జాగ్రత్తగా యుండవలయును. వాక్యబోధ వినని వారిమీద కోపపడకూడదు, శాంతముతో బోధింపవలయును. వారు వినకపోతే (చెప్పుట) మానివేయ వచ్చును.
-
నీటి మీద నడువుము, బండ్లకు (రైలు,బస్సు) ఎదురుగావెళ్ళి ఆపు చేయుము, చెట్ల మీదనుంచి, మేడల మీదనుంచి దుముకుము, అగ్నిలో పడుము; నీకేమియు హాని కలుగదు అని స్వంతాత్మయు, దురాత్మయు నీకు చెప్పునుగాని, నీవేమియు ఆ మాటలు వినవద్దు.
-
మంచి సంగతులు నేర్చుకొనేటప్పుడు, గర్విస్తే దుస్ధితి కలుగును. ఒకరికి వరములు రావడము చూచి గర్విస్తే, దుస్థితి కలుగును.
-
ఇన్ని లోభములున్న యెడల పరిశుద్ధాత్మపని ఏలాగు జరుగును?
పనిపాటలు ఎక్కువ చేస్తే స్వంత ఆత్మకు బలము తగ్గను.