ఆత్మపూర్ణులౌటకు మార్గము
దీనికి ఒక్కటే జవాబు: న్తుతి చేయుటయే
1. జయము నిమిత్తమై ప్రార్ధన చేయవలెను.
2. ఆ తరువాత స్తుతి చేయవలెను.
ఏలాగనగా:
- 1. ఓ దేవా! నేను ఈ శోధనను గెల్చుటవలన, నా విశ్వాసము స్థిరపడి నీకు మహిమ కల్గును. అందుచేతనే దీనిని రానిచ్చినావు కాబట్టి నీకు స్తోత్రములు.
- 2. మరియు నీవు ఈ శోధనను పంపలేదు కాబట్టి నీకు స్తోత్రములు.
- 3. పంపలేదు గాన నీవు నా తండ్రివైయున్నావు గాన నీకు స్తోత్రములు.
- 4 రానిచ్చినావు గాన, నీవు నా ఉపకారివైయున్నావు గాన నీకు స్తోత్రములు.
- 5. నీ సెలవు లేనిదే సైతాను (ఈ శోధన) పంపలేడు గాన నీకు స్తోత్రములు. అందుచే నీవు రాజువైయున్నావు గాన నీకు స్తోత్రములు.
- 6. పిశాచికి సెలవు ఇయ్యకపోతే; పిశాచి - "నాకు స్వతంత్రత గుణము నీవిచ్చినావు కదా!" అనును గాన పిశాచి సెలవడిగినపుడు, నీవు సెలవిచ్చుట న్యాయమే. ఎందుకంటే నీవు న్యాయకర్తవై యున్నావు గాన నీకు స్తోత్రములు.