బైబిలు మిషను ప్రత్యేక జీవనము
- ఎక్కడలేని బోధలు ఇక్కడ ఉండగా మరియొక మిషనులోనికి గాని, మతములోనికి గాని, స్వంత ఏర్పాట్లలోనికిగాని వెళ్లుట ఎందుకు?
-
ఎక్కడలేని స్వస్థతలు ఇక్కడ ఉండగా ఇతర యాత్రలెందుకు?
-
ఎక్కడలేని ప్రార్ధనోపదేశములు ఇక్కడ ఉండగా, ఇతర ప్రయత్నములు ఎందుకు?
-
ఎక్కడలేని కీర్తనలు ఇక్కడ ఉండగా "సినిమా రాగాలు" ఎందుకు? వేరొక సంగీతశాలకు పోవుట ఎందుకు? సినిమాకు పోవుటకాదిది, వేరొక మిషనులకు, రాగములకు పోవుట.
-
ఎక్కడలేని పత్రికలు ఇక్కడ ప్రచురమగుచుండగా, ఇంకొక ఆఫీసులోనికి వెళ్ళుట ఎందుకు?
-
ఎక్కడలేని దర్శనములు ఇక్కడ ఉండగా, వేరొక శకునములకు వెళ్ళుట ఎందుకు?
-
ఎక్కడలేని పరలోక భక్తుల సహవాసము, సంభాషణలును ఇక్కడ ఉండగా వట్టి స్థలములలో ఉండుట ఎందుకు? (పరలోక వాస్తవ్యులు వచ్చుట వట్టిది, దేవుడు కనబడుట వట్టిది, కనబడకపోయిన యెడల మాట్లాడుటకూడ వట్టిది. "మీరు భూతములతో మాట్లాడుచున్నారను మాట వట్టిది" అని ఇతర మిషనుల వారు ఆక్షేపించుచున్నారు గదా!). ఇట్టి, వట్టిదే అను వట్టి స్థలములలో నుండుట ఎందుకు?
-
నిజమైన వృత్తాంతములును, ఎక్కడా లేనివియు ఇక్కడ ఉండగా, ఏమియు లేని వట్టి స్థలములలోనికి దుముకుట ఎందుకు?
-
దేవుడు బైలుపరచిన బైబిలు మిషను సంగతులు అర్ధముకానప్పుడు, దేవుని యొద్దకు వెళ్లి ఆయనను అడగకుండా, మరకపడిన జ్ఞానము నొద్దకును, మరకపడిన మనస్సాక్షి నొద్దకును ఆలోచన కొరకు వెళ్లుట ఎందుకు?