బైబిలుమిషను వలన ఏమి మేళ్లు కలుగును



వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? అని పరమ గీతములో ఉన్న వచనము ఈ అంశమునకు సంబంధించినదే. అందరి రక్షకుల కంటె క్రీస్తు ఎందులో ఎక్కువ? అన్ని మతములలో క్రీస్తు మతము ఎందులో ఎక్కువ? అట్లే అన్ని మిషనులలో భైబిలు మిషను ఎందులో ఎక్కువ?

ప్రార్ధన:- మిక్కిలి అవసరమైన బోధలు అందించుచున్న తండ్రీ! నీకు వందనములు. వచ్చిన వారి తైలములను దీవించుము. "100 రెట్లు నన్ను రాకడకు సిద్ధపర్చుము" అను ప్రార్ధన వారికిమ్ము. ఆరోగ్యమునకు, రక్షణకు, రాకడకు సిద్ధపడుటకు ఎన్ని అడ్డు ప్రశ్నలు వచ్చినను, లెక్క చేయకుండునట్లు నీ కృప చూపించుము. తండ్రీ! నీవు బైలుపర్చిన బైబిలు మిషనును ఎన్ని గాలి తుఫానులు, ప్రశ్నలు, నాస్తికులు అడ్డము వచ్చినను పడకుండా కాపాడుము. నీవున్న దోనె మునుగదు. గాలి, అలలు వచ్చినను అవి దోనెను ముంచినవా! అన్ని మిషనులను, మతములను తెచ్చి ఈ మిషనులో చేర్చుదువు గాని భైబిలు మిషనును వాటిలో కలుపవు. లేదా! నీ మిషనును పెరికివేయవు. ఈ రాత్రి మమ్మును కాపాడుము. రాత్రికాల భీతులను నుండి తప్పించి సుఖనిద్ర నిమ్ము. మాకందరికి అనారోగ్య నివారణ, ఆరోగ్య ప్రదానము అనుగ్రహించుము. మమ్మును, మాకున్న వారిని కాపాడుటకై, నీ దూతలను కావలిగా పెట్టుము. కాకానిని, బేతేలు గృవామును, దేవాలయములను, నమాధుల దొడ్డిని, వత్రికల పనిని, ఇట్టి కూటములను, చందాలను అన్నిటిని, నువార్త పనిని దీవించుమని వేడుచున్నాము. ఆమేన్.