విశ్వాస ప్రార్ధన యొక్కలక్షణములు
- విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునికి శాశ్వత జీవనమును ఇచ్చును. దావీదు కీర్తనలు 1:2,3.
- విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుని ఫలింపజేయును. కీర్తనలు. 2:8.
- విశ్వాస సహితమైన ప్రార్థన పరమపురికి చేర్చు నావ వంటిది. ఆది. 6:9,14 విశ్వాస సహితమైన ప్రార్ధన పాలు తేనెల కంటె అధికమైన బలమిచ్చును. దానియేలు. 1:8-21.
- విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యుని క్రీస్తునకు నిజ స్నేహితునిగా చేయును. ఆది. 18:16-38.
- విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యుని దీనత్వము గలవానినిగా జేయును. అపో.కార్య. 7:57-60.
- విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునికి తప్పక జవాబునిచ్చును. ఆది. 18:9-10.
- విశ్వాస సహితమైన ప్రార్ధన ప్రపంచమందున్న శక్తులన్నిటి కంటె బలమైనది. అపో.కార్య.9:40,41.
- విశ్వాస సహితమైన ప్రార్ధన లోకాధికారులకు భయమును, ఆశ్చర్యమును కలిగించును. అపో.కార్య. 5:19,24
- విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునకు రక్షణాస్పదము. రోమా. 10:18.
- విశ్వాస సహితమైన ప్రార్ధన దుఃఖములో సంతోషమును కలిగించును. అపో.కార్య. 16:28-25.
- విశ్వాస సహితమైన ప్రార్ధన ఇహలోక అధికారుల పొరపాటులను దిద్దుటకు అధికారమును ఇచ్చును. మార్కు 6:17; రాజులు 21:17-24 1 రాజులు 15-16.
- విశ్వాస సహితమైన ప్రార్ధనయే జనాంగములను ఎదిరించుటకు శక్తినిచ్చును. 1రాజులు 18:36-39.
- విశ్వాస సహితమైన ప్రార్ధన కరవులో ఆహారము నిచ్చుటకు శక్తిగలది. 1రాజులు 17:15,16. '15. 16. క్ష 18. 19. 20. 21. 22. 23. 24 20
- విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యునికి నిజ పశ్చాత్తాపమును, మారుమనస్సును కలుగజేయును. లూకా. 22:60-62.
- విశ్వాస సహితమైన ప్రార్ధన ప్రాపంచిక శ్రమలను యెడబాపుటకు అమోఘమైన సాధనమైయున్నది. ఆది. 39:1-10.
- విశ్వాస సహితమైన ప్రార్ధనయే దైవజనుని భక్తులయొద్దకు నడిపించును. అపో.కార్య. 10:17-33.
- విశ్వాస సహితమైన ప్రార్ధనయే ప్రజల దయను, అధికారుల దయను, దేవుని దయను సంపాదించుకొను ముఖ్య సాధనమైయున్నది. లూకా 2:52.
- విశ్వాస సహితమైన ప్రార్ధనయే మంచి యుద్ధము చేయుటకు బలమైన యుద్దోపకరణమై యున్నది. దానియేలు. ౩3:10-18.
- విశ్వాస సహితమైన ప్రార్థనయే మనుష్యుని పరలోకమందు జేర్చెడి నిచ్చెన. ప్రకటన. 41-93.
- విశ్వాస సహితమైన ప్రార్ధనయే, నరహత్య మొదలగు పాపముల నుండి పరిశుద్ధతకు మరలుటకు పునాదియై యున్నది. దానియేలు. ౩3:28-29.
- అనుభవమైనచో, మన ప్రభువు నేర్పిన ప్రార్ధనయే, పరమ పురికి మనలను ప్రవేశపెట్టు రాజమార్గము. మత్తయి 6:9-14
- విశ్వాసి ప్రార్ధన జేయుచోట్ల సాతాను సంచారము చేయుచున్నాడు. యోబు. 1:7.
- ప్రార్ధన సలుపని విశ్వాసి హృదయము పెద్దపులులుండెడి గుహయును, మిడునాగులుండెడి పుట్టయునై యున్నది గనుక అట్టిదానిని మార్చుట కష్టతరము. 1రాజులు 21:77-16.
- గనుక విశ్వాస ప్రార్ధన సలుపుట ఈ కాలమందున్న విశ్వాసికి ఎంతో అవసరము. అన్ని స్థితులలో మనలను సంరక్షించి, అన్ని పరిస్థితులనుండి మనలను గట్టెక్కించగల సాధనము ఈ విశ్వాస ప్రార్ధనయే. ఒక విశ్వాసి - అంతరంగ విశ్వాసిగాను, రాకడ విశ్వాసిగాను తయారగుటకు ఈ విశ్వాస ప్రార్ధనను అభ్యాసము చేసికొనవలెను. అనగా ఈ విశ్వాస ప్రార్ధనయొక్క లక్షణములన్నియు తన అనుభవములో సంపాదించు కొనవలెను.
ఇట్టి స్థితిని పెండ్లికుమారుడైన క్రీస్తుప్రభువు చదువరులకు అందించి, విశ్వాస పూర్ణులనుగా చేసి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక! ఆమెన్.