విశ్వాస జీవనము



శరీర నేత్రము:- భూలోకమును, మేఘములను, నక్షత్రములను, సూర్య చంద్రాదులను ఈ నేత్రము చూడగలదు. మొత్తముమీద శరర నేత్రము కొంతమట్టుకే చూడ గలదు. అంతా చూసేది అది వేరు. అది ఆత్మనేత్రము. ఇది మాంస నేత్రము గనుక మహిమను చూడలేదు. శరీర నేత్రము గనుక సర్వమును చూడలేదు. ఈ నేత్రము తరచుగా పాపము తట్టు నీడ్వబడుచుండును గనుక పవిత్రతను చూడజాలదు. దీని దృష్టి అంతయును ఇహలోకము తట్టుయుండును. ఈ నేత్రమునకు సాధ్యమైనవి సాధ్యమైనవిగానే కనబడును. ఇది అసాధ్యమైన విషయములను చూడ శక్తిలేని నేత్రము.


విశ్వాస నేత్రము:- విశ్వాసమును నేత్రము అనవచ్చును. ఎందుచేతనంటే ఇది అన్నిటిని చూడగలదు. దీనికి దూరదృష్టి దివ్యదృష్టి కలదు. ఈ కంటికి, అసాధ్యమైన విషయములు సాధ్యములుగా కనివించును. ఇది లోక సంబంధులకు గ్రాహ్యము కాని నేత్రము, వారికి అర్ధముకాని విషయము. అనగా, ఒకరు వ్యాధిగా నున్న యెడలను, ఇంకనూ రోగి బాధపడుచున్నను; బాగుపడకముందే బాగుపడినట్టు, భాగువదిన స్థితిని విశ్వాన న్యేతము ముందుగానే చూడగలదు. లేమిలో నున్నప్పుడు కలిమిని చూడగలదు. దుఃఖములో ఉన్నప్పుడు సంతోషమును చూడగలదు. నిరాశలో నున్నప్పుడు నిరీక్షణను, నిస్సహాయములో నున్నపుడు సహాయమును చూడగలదు. బాధలలో నున్నప్పుడు స్వస్థతను చూడగలదు. బలహీనముగా నున్నప్పుడు బలమును చూడగలదు.


ఓ సహోదరుడా! విశ్వసించుట వేరు, విశ్వాన వరము కలిగియుందుట వేరని గ్రహించుము. ఓ మిత్రుడా! నిరీక్షణ వేరు, విశ్వాసము వేరని గ్రహించుము. విశ్వసించుట సామాన్య విషయము కాదు. అది అబ్బినటైతే కష్టమైన విషయము కాదు.


నిరీక్షణ: - నిరీక్షణ అనగా ఒక సంగతిని గూర్చి ప్రార్ధించకముందు, "నేను ప్రార్ధిస్తాను, ప్రభువు వింటారు, అది నెరవేరుస్తారు" అని నమ్ముట. ఇది విశ్వాసము కాదు గాని నిరీక్షణ అయియున్నది. ఒక సంగతిని గూర్చి ప్రార్థించిన తరువాత 'నేను ప్రార్థించినాను, ప్రభువు నా ప్రార్థన విన్నారు, తప్పక నెరవేరుస్తారని' నమ్ముట, ఇదియు విశ్వాసము కాదు సుమా! ఇదియు నిరీక్షణయే. నిరీక్షించువారు ధన్యులు, వారు నిరీక్షణ ఫలము పొందుదురు.


విశ్వాసము:- విశ్వాసము అనగా ఒక నంగతిని గూర్చి ప్రార్ధించిన తరువాత, ఆ ప్రార్ధించిన విషయము జవాబు పొందని సమయమందు, "జవాబు వచ్చెను? ప్రార్ధన నెరవేరెను" అని పలుకుటయే విశ్వాసము. ఇది విశ్వాసపు పలుకు. విశ్వాసమనగా ఇదియే. విశ్వాసమును గూర్చి వివరించుట కష్టము.


ఉదా: ఆకలి సమయమందు అన్నము పెట్టుకొని తింటిని, ఆకలి తీరెను. అంతలో ఒకరు వచ్చి అన్నము తింటివా? అని అడిగిరి. నేను 'ఔను, తినుట ముగించితిని' అని చెప్పితిని. ఆకలి తీరెనా? అని ప్రశ్నించిరి. "అవును, తీరెనంటిని". ఏలాగు తీరెనని మరలా ప్రశ్నించిరి. తినుట వలన తీరెనని మరలా జవాబిచ్చితిని. అనగానేమి? అని మరలా ప్రశ్నించిరి. అనగానేమో తెలుసునుగాని వివరించలేనని జవాబిచ్చితిని. ఆకలి తీరుట ఎరుగుదును, తీరినదని చెప్పగలను గాని వివరించుట తెలియదు.


విశ్వసించుట: - ప్రార్ధించిన సమయమందు అనేకమైన అపజయములు కలుగును. అయినను విశ్వసించుట కొనసాగింపుము. ముగింవులో సంవూర్ణ జయము చూడగలవు.


ఓ స్నేహితుడా! నీవును, నీ కుటుంబమును, విశ్వాసము వలన జీవింపవలెనని (శరీరాత్మల విషయము) నీకున్న యెడల, నీవును నీ కుటుంబమును దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్ధించి, విశ్వాస వరమును పొందుడి. అప్పుడు విశ్వాసమనగా నేమో నీవు గ్రహించుదువు. అప్పుడు అనుదినము విశ్వాస బ్రతుకులో, అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలవు. విశ్వసించువారు అనేకులు కలరు. అయితే విశ్వాసవరము గలవారు కొద్దిమందే ఉన్నారు.

షరా:- సహోదరుడా, పైనున్న 15 విషయములన్నియు నమ్ముటకు ఎంత నమ్మకము అవసరమో, అంత నమ్మకముతో ఒకసారిగా దేవుని నమ్ముము. అప్పుడు నీవు నీ శరీరాత్మల విషయములో ఇతరులకంటే శ్రేష్టమైన వాడవుగా జీవించుచు, దేవుని మహిమను చూడగలవు. ఓ మిత్రుడా! వైనున్న 15 విషయములన్నిటి మీద ఆనుకొనుటకు ఎంత శక్తి అవసరమో, అంత శక్తితో దేవుని మీద ఆనుకొనుము. ఆలాగు ఆనుకొనుట, నమ్ముట అవసరము. ముందు నమ్ముము, నమ్మిన తరువాత విశ్వాస వరమును గూర్చి ప్రార్థించుము. ప్రార్థన ముగించిన తరువాత అభ్యాసము చేయుము. అటు తరువాత విశ్వాసమును గూర్చి ఏవైనా ప్రశ్నలు ఉన్న యెడల, ప్రశ్నలడిగి జవాబు పొందవచ్చును. నీవు పోయి ఈలాగు చేయుము.


దేవుడు నీకు దర్శనములోగాని, స్వప్నములోగాని కనబడినను, కనబడక పోయినను ఈలాగు చేయుము. అప్పుడు నీవు దేవునిని మహిమ పరచుచూ వర్ధిల్లగలవు. దేవుడు కనబడుట, కనబడక పోవుట అనునవి మన హృదయస్థితిని బట్టియు, అవసరమును బట్టియు ఉండును. "హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూతురు" అనునదియు నిజమే. ఇదొక మార్గము, అనగా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూతురు. వేరొక మార్గము గలదు. అందరికీ ఒకే మార్గమైతే దేవుని దగ్గరున్న పద్ధతులు అన్నీ ఏలాగు ఖర్చుగును?


1) దేవుని మీద అనుకొనుట, నమ్ముట.    2) ఆయనే కనబడి, నెరవేర్చుట
ఫిలిప్పి. 4:19 చదివినారా?

ఫిలిప్పి 4:19; మత్తయి 5:8. ఈ రెండునూ మార్గములే. దేవుని వాక్యమును ఆధారము చేసికొని, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తీవ్రముగా తన పనిని కొనసాగించుటకు ఆధారమైన వచనము: "నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను". ఫిలిప్పి. 4:13.