స్థిరవిశ్వాస విద్య



ఒక అంశమును గూర్చి పూర్తిగా ప్రార్ధన చేసిన తరువాత అది నెరవేరును, అనగా దేవుని కృపలో నెరవేరియుండును. ఆ నెరవేర్పు మనకు కనిపించే వరకు స్తుతి చేయవలెను. ప్రార్ధనలో ఎంత పట్టుదల ఉండునో ఆసక్తిలో అంతే పట్టు ఉండవలెను. ఇవి రెండూ కలిసి స్తుతిలో ఉండవలెను. అప్పుడు నెరవేర్పు ఉండవలెను. దీనికే స్థిరమైన విశ్వాసమని పేరు.

జంకు ఉండకూడదు. నెరవేరకపోవడమునకు గల ఆటంకములు, గురుతులు, నీడలు కనిపించునప్పుడు మరింత ఎక్కువ నమ్మవలెను, ఎక్కువ స్తుతింపవలెను. ప్రార్ధన మాత్రము ఒకసారితో ముగింపవలెను. అయితే నెరవేర్పు అగువరకు స్తుతి చేయచుండవలెను.