సమృద్ధి జీవనము
- 1. "ప్రభువు నాతో బైబిలు ద్వారా మాట్లాడుచున్నారు". ఈ నమ్మికతో ప్రతి దినము బైబిలు చదువవలెను.
- 2. "నేను నా తండ్రితో మాట్లాడుటకు ప్రార్ధన ద్వారా సెలవు దొరికినది" అనే నమ్మికతో అనుదినము ప్రార్ధన చేయవలెను.
- 3. కుటుంబ ప్రార్ధన, ఎంత తక్కువ సమయమున్నను చేసి తీరవలెను. ఎందుకంటే జనాంగములు, కుటుంబములో నుండియే వచ్చెను. అధికారులు, పండితులు, వేదాంతులు, శాస్త్రజ్ఞులు, యోధులు అందరూ అక్కడి నుండియే వచ్చిరి. మీ పిల్లలు తుదకు ఏ మంచి విషయములో ప్రఖ్యాతి పొందుదురో మీకు తెలియదుగదా! అందుచేతనే కుటుంబ ప్రార్ధన చేయవలెను.
-
4 "దేవుని ఇల్లగు దేవాలయమునకు వెళ్ళుటకు సాకులు చెప్పిన యెడల, ప్రభువు మా ఇంటికి రాడు" అనే తలంపుతో ప్రతి ఆదివారము గుడికి వెళ్ళి, నీ చేతిక్రింది పంతులుగారు ప్రసంగము చేసినను, విద్యార్థివలె కూర్చుండి వినుటకు వెళ్ళువలెను. గృహములు రెండు:
- 1) నీ గృహము,
- 2) నీ దేవాలయము.
- 5. మిక్కిలి ఇబ్బందిలో నున్నప్పుడు సహితము, దేవాలయముయొక్క చందావేయుట మానవద్దు. సమృద్ధిగా నున్నప్పుడు వేస్తే అంత విలువలేదు. ఇబ్బందిలో నున్నప్పుడు వేసే దానికే విలువ. గనుక నీవు చందావేసే ప్రతి దమ్మిడికి గొప్పు ఉద్యోగము కలదని మరువవద్దు.
- 6. "నాకు వర్తమానము రావడము లేదు" అని కోపగించుకొని, ఇతరులకు సువార్త చెప్పుట మానవద్దు. వాక్యము చెప్పుట మానుకొంటే సంఘము వృద్ధి కాదు. మాట్లాడు వ్యక్తివి నీవు కాదు, నీలోని వ్యక్తి.
- 7 క్రిస్మసు, ఈస్టరు మొదలగు పండుగలయందును, సౌఖ్యకాలమందును సంతోషించుట కంటే, శ్రమలలో సంతోషించుట మహాధన్యత అని మరచిపోవద్దు.
- 8. బీదలను, అక్కరగలవారిని ఒక కంట చూచుచుండుము.
- 9. మనము రాకడకు ముందు, అనగా రాకడకు సమాపముగా నున్నవారము గనుక తరచుగా ఆత్మవలన నింపబడుచుండవలెను. ఆకలివేయునపుడు ఉదరమును అన్నముతోను, నీళ్ళతోను నింపుకొనుచున్నాము గదా! మాటిమాటికి, నిమిష నిమిషమునకు గాలి పీల్చుచున్నాము గదా! ఇంకేమి? అలాగే ఇది కూడాను.
- 10. తప్పుడు దర్శనములు, తప్పుడు స్వప్నములు, తప్పుడు ఊహలు మనస్సులోనికి రానియ్యక చెప్పులు బయట విడిచివేయునట్లు వాటినికూడ విడిచి వేయుము.
- 11. ఏది తప్పు అని నీకు తెలుసునో, అది మానివేయుము.
- 12. నీ జ్ఞానమును వృద్ధి చేసికొనుటకై, బైబిలును చదువుట మాత్రమేకాదు; ఇతర పుస్తకములు, పత్రికలు చదువుచుండవలెను. మరియు అందరితోను మాట్లాడు చుండవలెను. అప్పుడు సంగతులు తెలియగలవు.
- 13. రాకడ సమీపము గనుకను, దాని తరువాత సంఘము యొక్క పుస్తకములోని ప్రోగ్రాములో (కార్యక్రమములో) మరియొక సంగతి లేదు గనుకను, రాకడను గురించి రేయింబగళ్ళు, చెమట ఊడ్చి కష్టపడవలెను. పరీక్షనెల ఉన్నదనగా విద్యార్థి ఎక్కువ కష్టపడకపోతే, పరీక్ష అయిన పిదప కష్టపడునా?
- 14. నీ తలంపులోనికి ఇంకా ఎన్ని నంబర్లు (అంశములు) వచ్చునో, వాటన్నిటి ప్రకారము చేసి తీరవలెను.
- 15. మా ప్రదేశములలో మాత్రమే గాక, సర్వలోకమునకు సువార్త పంపుటకు మీరు సాధనములై యుండవలెను. "భూదిగంతముల వరకు" అని ప్రభువు చెప్పెను గదా! బైబిలు ఎన్ని భాషలలోనికి తర్జుమా అయినదో, అన్ని భాషలలోనికి సువార్త పంపుట మన విధి.
- 16. అన్ని ప్రార్ధనలు అయిన తరువాత ఒక ముఖ్యమైన విషయము కలదు. అనేకులు ఇందులో తప్పిపోవుచున్నారు. మనము చెప్పిన యెడల వారికి కోపము వచ్చును గాని, "కనిపెట్టుటయే" ఆ అంశము.
- 17. అన్ని ప్రార్ధనలు అయిన తరువాత, ప్రభుయేసు యొక్క రక్తముచేత శుద్ధి చేసికొనవలెను.
ఉదా: అయ్యగారి మీదకు రెండు దయ్యాల గుంపులు వచ్చి, నీవు ప్రార్ధన చేసికొనిన తరువాత "ప్రభువు యేసు రక్తమునకు జయము" అని చెప్పలేదేమి? అని అడిగినవి.
జవాబు: నా శరీరములో అన్ని అవయములెట్లు ఉన్నవో, అట్లే ప్రభు యేసు రక్తము కూడ ఉన్నది. నేను ఏ అలవాటు ప్రార్ధన చేసినా, అది ప్రార్థనే గదా! అది పరలోకములో నెరవేరును. బైబిలు మిషనును శుద్ధి, వృద్ధి చేయుటకు ప్రభువు నన్ను ఏర్పర్చుకొన్నాడు గనుక నేను చేస్తాను.