మోకాళ్ళ జీవనము
- స్తుతి రాకపోయినను సరే
- చందా ఇచ్చే మనసు లేకపోయినను సరే,
- లేనిపోని తలంవులు వచ్చినను సరే,
- ఇష్టము లేకపోయినను సరే,
- సమయము లేకపోయినను సరే
- నిద్ర వచ్చినను సరే
- బైబిలు చదువుటకు ఆశ లేకపోయినను సరే,
- ఎన్ని నిందలు వచ్చినను సరే
- మోకాళ్ల నొప్పీ వచ్చినను సరే,
- ప్రార్ధన రాకపోయినను సరే,
- ఫలితము లేకపోయినను సరే
- ధ్యానించుట లేకపోయినను సరే,
- మిష, సాకులు, అబద్ధములు చెప్పక మోకాళ్ళూనవలెను.
ఇవన్నియు లేకపోయినను సరే మోకరించవలెను. ఇదే అన్నిటికి మార్గము. క్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో మహిమ జీవనము చూపును. అప్పుడందరు మోకరింతురు. గనుక ఇప్పుడే అది చేయవలెను.
ప్రార్ధన లేకపోయినను, పాపవిసర్జన లేకపోయినను, ఉజ్జీవము లేకపోయినను, బైబిలు చదువుట లేకపోయినను, కీర్తనలు పాడకపోయినను, ప్రసంగములు చేయక పోయినను: "మోకాళ్ళమీద నుండిన యెడల" వీటన్నిటికి ద్వారముగా ఉండును. అవన్నియు కలుగును.
షరా: అనుదినము 4గం॥కు లేచి మోకాళ్ళూని ప్రార్ధన, స్తుతి చేయవలెను. శ్రమలున్నప్పటికినీ అవి తప్పించుకొనుటకు మోకాళ్ళ జీవనమే ఒక గొప్ప సాదనము. ఇది శ్రమయైనను చేయవలెను.
మన బ్రతుకుయొక్క జీవనము

నామక జీవనము => మహిమ జీవనము => విసర్జన జీవనము => ప్రత్యక్ష జీవనము => సామాన్య జీవనము => ఉజ్జీవ (ఉత్సాహ) జీవనము.