పెండ్లికుమార్తె విసనకర్ర
వివరము
- 1) విజ్ఞానము : అనగా రాకడను గూర్చిన సంగతులన్నియు పూర్తిగా తెలుసుకొనుట.
- 2) విన్నపము : ప్రార్ధించవలసిన సంగతులన్నియు ప్రార్ధించివేయుట.
- 3) విశ్వాసము: ప్రభువు నన్ను పెండ్లికుమార్తె వరుసలోనికి చేర్చుకొనునని నమ్ముట.
- 4) విధేయత : తండ్రి చెప్పిన ప్రకారము యావత్తు చేయుట.
వధువు 'వీ'లు: = వినండి, విచారించండి, విశ్వసించండి, వినిపించండి; అనగా వినిన దానిని, విచారించిన దానిని, విశ్వసించిన దానిని అందరకూ వినిపించండి. ఆయన ఇన్ని "వీ"ళ్ళు కల్గించకపోతే, సర్వజనులకు ప్రకటించండని అనరు.
వధువు రాగం: వధువు జ్ఞానం, మనస్సాక్షి ఒక బెంచీమీద కూర్చున్నాయి. ఇవి అన్నియు ఒక్కటే పాడును. అది ఉచ్చు-రాగం; అచ్చు-తాళం గనుక మన క్రైస్తవ మతము హెచ్చు - అపుడు సైతాను చచ్చు.
- అందరి నిమిత్తము ప్రార్ధించవలెను.
- అందరికి సువార్త ప్రకటించవలెను.
- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలయును.
- ప్రభువు మన కాలములో వచ్చుచున్నారని నమ్మవలెను.
- కళంకమేమియు లేకుండ ఉండవలెను.
- గుర్తులు జరుగుచున్నవని కనిపెట్టవలయును.
- 'నేను తండ్రికి సమ్మతమే' అని నమ్మవలెను.